హైదరాబాద్‌లో మ్యాక్స్ ఫ్యాషన్ కొత్త స్టోర్: సీఈవో సుమిత్ చంద్నాతో కలిసి ప్రారంభించిన మృణాల్ ఠాకూర్
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్‌లో ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ మ్యాక్స్ ఫ్యాషన్ తమ సరికొత్త ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈవో సుమిత్ చంద్నాతో కలిసి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ లాంఛనంగా ప్రారంభించారు. సరికొత్త డిజైన్ శైలితో హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి స్టోర్ ఇదే కాగా, నగరంలో మ్యాక్స్‌కు ఇది 39వ విక్రయ కేంద్రం.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘మ్యాక్స్ ప్రాజెక్ట్ న్యూ’ కలెక్షన్‌ను ప్రదర్శించారు. నటి కల్కి కోచ్లిన్ క్యూరేట్ చేసిన ఈ కలెక్షన్‌ను రాజస్థాన్‌కు చెందిన సంగనేర్ బ్లాక్ ప్రింటింగ్ శైలి ప్రేరణతో, చెన్నైలోని కైరస్సీ ఫౌండేషన్‌కు చెందిన దివ్యాంగ కళాకారులు తీర్చిదిద్దారు.
వినియోగదారులకు మరింత విశాలమైన, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని అందించేలా స్టోర్ లేఅవుట్‌ను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో పురుషులు, మహిళలు, పిల్లల దుస్తులతో పాటు పాదరక్షలు, ఇతర ఫ్యాషన్ యాక్సెసరీలను అందుబాటులో ఉంచారు.
మ్యాక్స్ ఫ్యాషన్‌కు హైదరాబాద్ ఎల్లప్పుడూ కీలకమైన మార్కెట్ అని సంస్థ సీఈవో సుమిత్ చంద్నా పేర్కొన్నారు. భారత్‌లో బ్రాండ్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘న్యూ ఐడెంటిటీ’ విస్తరణలో భాగంగానే ఈ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు.
