‘జైలర్ 2’ సెకండ్ సింగిల్.. ప్రోమోతో హైప్ పెంచనున్న అనిరుధ్..?

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, మూవీ మేకర్స్ అభిమానుల కోసం బిగ్ అప్‌డేట్‌ను అందించారు. ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ప్రోమోను ఈరోజు(సెప్టెంబర్ 23) రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.

అయితే, ఈ పాట కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్స్ కట్టినట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా పాటను పాడినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాటతో ఈ మూవీపై మరోసారి హైప్ పెంచడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనిరుధ్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవనున్న ‘జైలర్ 2’ సినిమాలో ఎస్‌.జె.సూర్య, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ, నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version