మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 20న ఘనంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి, డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి 2027 చివరినాటికి ముగించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఇక ఈ సినిమాలో చరణ్ కొత్త అవతారంలో కనిపించేందుకు ఇప్పటికే బరువు తగ్గుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.
