జాక్‌పాట్ కొట్టేసిన దిల్ రాజు.. ఏకంగా రూ.100 కోట్లు..?

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మాన్‌స్టర్’. సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముంబైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ఓవర్సీస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, రోనిత్ రాయ్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దిల్ రాజు, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ ఏకంగా రూ. 100 కోట్లకు దక్కించుకున్నట్లు బిజినెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో కుదిరినట్లు తెలుస్తోంది.

సినిమా బాక్సాఫీస్ స్టామినాపై నమ్మకంతో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ 2027 ఈద్ కానుకగా దీనిని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ బిజినెస్ డీల్‌పై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version