పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా విడుదల తేదీపై అభిమానుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. డిసెంబర్ రేస్ నుంచి ఈ చిత్రం తప్పుకున్నట్లు ఇటీవల స్పష్టత రాగా, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మార్చిలో రావడం ఖాయమైతే ‘ఫౌజీ’ వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి వెళ్లే అవకాశం ఉంది.
అయితే జనవరి మూడో వారంలో రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయడం కూడా మరో బెటర్ ఆప్షన్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నారు. కాగా, ఈ నిరీక్షణకు కాస్త ఊరటనిస్తూ అక్టోబర్‌లో ఈ సినిమా నుంచి ఒక క్రేజీ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ టీజర్లో రిలీజ్ డేట్ పై ఏదైనా క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యంలో సాగే ఓ బ్రాహ్మణ సైనికుడి కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, పలువురు బాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఒక పాటను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
