మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు కాకా లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన తర్వాత తన మార్క్ పోస్టులు కూడా వేస్తూ వచ్చేవారు. కానీ సోషల్ మీడియాను ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు క్లియర్ గా అర్ధం అవుతుంది.
నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో జరిపిన ఫన్ సంభాషణలో నన్ను తొక్కేసావా అంటూ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. కొన్నాళ్ల నుంచి ఇప్పటికీ కూడా సోషల్ మీడియా బాస్ తొక్కేసాడు అది ఇది అంటూ పలు పోస్టులు వైరల్ గా మారాయి.
వాటికి కౌంటర్ గా అన్నట్టు తనే వేయడం ఇప్పుడు అందరిలో షాకింగ్ గా మారింది. దీనితో సోషల్ మీడియా విషయంలో మెగాస్టార్ ఎంత పక్కాగా అబ్జర్వ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
