ఎస్ఐ యుగంధర్ టీజర్ టాక్ : ఇంటెన్స్ అవతారంలో ఆది సాయికుమార్.. యాక్షన్‌తో చెలరేగాడు..!

యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఎస్‌ఐ యుగంధర్’. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్‌లో ఆది ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించాడు. ఉత్కంఠ రేకెత్తించే సీన్లు, యాక్షన్ ఎలిమెంట్స్ మరియు ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా సాగింది. ఈ చిత్రాన్ని యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జులూరు నిర్మిస్తున్నారు.

మేఘలేఖ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాకేందు మౌళి, లావణ్య, పవన్ తేజ్ కొణిదెల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్కస్ ఎమ్ సంగీతం అందిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version