కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు నటించిన క్రేజీ సీక్వెల్ చిత్రమే ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలు అయితే సెట్ చేసుకుంది. ఆల్రెడీ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకున్నాయి.
అయితే మన దగ్గర సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది కానీ తమిళ్ లో మాత్రం ఇప్పటికీ ఆడియో లాంచ్ మాత్రమే ఉంది. ఇలా అక్కడి స్టార్ హీరోస్ ఆడియో లాంచ్ లు ఘనంగా చేసి తర్వాత టెలికాస్ట్ కి వదులుతారు.
అయితే రజిని గత రీసెంట్ సినిమాలు అన్నిటికీ ఆడియో లాంచ్ లు జరిగాయి కానీ జైలర్ 2 కి మాత్రం ఇలాంటి ఆడియో లాంచ్ లు ఏమి ఉండవు అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం రజిని ప్లాప్ చిత్రాలు కబాలి అలాగే అన్నాత్తే (పెద్దన్న) సినిమాలు కూడా ఆడియో లాంచ్ లు లేకుండానే వచ్చాయి కానీ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఎంతో పొటెన్షియల్ ఉన్న జైలర్ 2 కి కూడా అంటున్నారు. సో ఈసారి ఏమవుతుందో చూడాలి.
