‘రణబాలి’ నుంచి సాలిడ్ సర్‌ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు. భారతీయ చరిత్రలో మరుగునపడిపోయిన ఒక నిజాన్ని వెలికితీసేందుకు రెండేళ్ల సుదీర్ఘ పరిశోధనతో అత్యంత ఆసక్తికరమైన డాక్యు-సిరీస్‌గా ‘రణబాలి’ని రూపొందించారు.

గత 150 ఏళ్లుగా దాచిపెట్టబడిన, మర్చిపోయిన మరియు చెప్పబడని ఒక చేదు నిజమైన చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఇప్పటివరకు మనం విన్నది కేవలం ఒక వైపు కథ మాత్రమేనని, కానీ అసలు జరిగింది అంతకంటే చాలా దారుణమైనదని తెలుపుతూ మేకర్స్ ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. చరిత్రలో సమాధి అయిపోయిన సత్యాలను, భయంకరమైన ఘట్టాలను నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ 4 ఎపిసోడ్ల డాక్యు-సిరీస్‌ను రూపొందించారు.

ఎప్పటికీ మరిచిపోకూడదని చాటిచెప్పే ఈ చారిత్రక కథనానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ కానుంది. స్పెషల్ పరిశోధనతో రూపుదిద్దుకున్న ఈ ‘రణబాలి’ డాక్యు-సిరీస్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Exit mobile version