న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఐతే, ఈ సినిమాలో మోహన్ బాబు తన నటనతో మరోసారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి ఇలాంటి విలక్షణమైన నటుడిని తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత విభిన్నమైన పాత్రల్లో ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఆయనలోని నటనా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తరహా క్యారెక్టర్లు రాస్తే.. మోహన్ బాబు నటనా జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన వెరీయేషన్స్ ను చూడవచ్చు.
అలాగే మోహన్ బాబు లాంటి అనుభవజ్ఞులైన నటులకు బలమైన పాత్రలు ఇస్తే కథలకు మరింత వెయిట్, పెర్ఫార్మెన్స్‌కు మరింత స్కోప్ దొరుకుతుంది. ఇకపై ఇలాంటి నటుల కోసం ప్రత్యేకంగా వైవిధ్యమైన పాత్రలను డిజైన్ చేస్తే తెలుగు సినిమాల్లో మరిన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ తరం దర్శకులు ఆ రకంగా ఆలోచిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా విలన్ గా మోహన్ బాబు తనదైన శైలిలో మెప్పించాడు.
