‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ ‘రాకా’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇటీవల ముంబైలో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశారు. కాగా అక్టోబర్ రెండో వారం నుంచి ‘రాకా’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బన్నీతో పాటు మిగిలిన ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారట. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ను తీస్తారట. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మొత్తానికి ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
