ఎన్టీఆర్ ‘మైథలాజికల్ డ్రామా’ అప్పటినుంచే ?

Jr-NTR (1)

దర్శకుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ భారీ మైథలాజికల్ చిత్రం పై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది, ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ లోపు త్రివిక్రమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్, విజువల్ డిజైన్‌పై ఫోకస్ చేస్తాడట. అటు ఎన్టీఆర్ కూడా తన ప్రస్తుత సినిమా ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే, ఈ ప్రాజెక్ట్‌పైకి రానున్నాడు. ఇక ఈ సినిమాలో పౌరాణిక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలవనున్నాయి. అలాగే, ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవుడిగా నటుస్తున్నారు.

పైగా ‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి’’ పాత్రలో తారక్ నటిస్తున్నాడు. అందుకే, ఎన్టీఆర్ లుక్ పై స్పెషల్ విఎఫ్ఎక్స్ చేపించేలా త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. పైగా తారక్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు ఉండటం, అన్నిటికీ మించి మైథలాజికల్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కావడంతో.. త్రివిక్రమ్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా.

కాగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

Exit mobile version