‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ కలెక్షన్స్.. వీకెండ్ లెక్కలు ఇవే..!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ మొదటి వీకెండ్‌లో మిక్స్డ్ వసూళ్లను రాబట్టింది. నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లతో దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించే స్థాయికి చేరుకోగా, మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.
​అంతర్జాతీయ మార్కెట్‌లో తొలిరోజు ఏకంగా 2.3 మిలియన్ డాలర్లతో సంచలన ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాత తీవ్రమైన డ్రాప్ కనిపించింది. పెరిగిన నెగెటివ్ రివ్యూల ప్రభావం ఓవర్సీస్‌లో స్పష్టంగా పడటంతో మిగిలిన రోజుల్లో కేవలం 650కె డాలర్స్ మాత్రమే రాబట్టి, మొత్తం నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌కు 2.95 మిలియన్ల డాలర్స్ సాధించింది.

Exit mobile version