సూర్యతో జక్కన్న సాలిడ్ ప్లానింగ్.. రికార్డులు ఖాయం..?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో ఒక సినిమా చూడాలని సినీ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మళ్లీ ప్రాణం పోశాయి. సూర్యతో సినిమా గురించి ప్రశ్నించగా.. “మేమిద్దరం కలిసి పనిచేసినప్పుడు అది చాలా ప్రత్యేకమైన చిత్రమవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ‘కంగువ’ ప్రమోషన్స్ సమయంలో కూడా రాజమౌళి మాట్లాడుతూ, ‘గజినీ’ సినిమాతో తెలుగులో సూర్య చేసిన ప్రచారమే తనను పాన్-ఇండియా వైపు అడుగులు వేసేలా ప్రేరేపించిందని, ఆయనతో పనిచేసే అవకాశం ఒకసారి మిస్ అయిందని గుర్తు చేసుకున్నారు.

​అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ పనుల్లో పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరోవైపు సూర్య కూడా జిత్తు మాధవన్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించే చిత్రాలతో పాటు పలు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇద్దరి చేతిలోనూ వరుస కమిట్‌మెంట్లు ఉండటంతో, ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పడుతున్నప్పటికీ, రాజమౌళి మాటలతో అభిమానుల్లో ఆశలు మాత్రం సజీవంగా ఉన్నాయి.

Exit mobile version