విడుదల తేదీ : 04 నవంబర్ 2011 | ||
రేటింగ్ : 2.75 / 5 | ||
దర్శకుడు : కృష్ణవంశీ | ||
నిర్మాత : నల్లమలపు శ్రీనివాస్ | ||
సంగీత దర్శకుడు : బాబు శంకర్ | ||
పాత్రలు : గోపీచంద్, తాప్సీ, శ్రద్ధాదాస్ |
కళాత్మక చిత్రాలు రూపొందించటంలో దర్శకుడు కృష్ణవంశీది అందెవేసిన చెయ్యి. సమాజానికి ఏదోక సందేశం ఇవ్వాలనే అతని ఉత్సుకత అతని సినిమాల్లో గోచరిస్తుంది. ఇప్పుడు ఆయన ‘మొగుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ లో గోపీచంద్ – తాప్సీ హీరో, హీరోయిన్లుగా నటించగా శ్రద్ధాదాస్ ఒక ముఖ్యమైన పాత్ర లో కనిపించింది. ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెరలను తాకింది. ఆ సినిమా పోకడ ఎలా వుందో ఎప్పుడు చూద్దాం..
కథ: డబ్బుతోపాటు మంచి పేరున్న రైతు ఆంజనేయ ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కుమారుడు బుజ్జి (గోపీచంద్). వీరిది కలిసి మెలసి ఉండే మంచి సాంప్రదాయ కుటుంబం. బుజ్జి అనుకోని పరిస్థితులలో ఎదురైన రాజరాజేశ్వరి (తాప్సీ) ప్రేమలో పడతాడు. పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ చాముండేశ్వరి (రోజా) – నరేష్ ల కుమార్తె రాజరాజేశ్వరి. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు సంతోషంగా అంగీకరించినప్పటికీ ఊహించని పరిస్థితుల్లో వీరి కుటుంబాల మధ్య విభాదాలు వస్తాయి.
ఈ నేపధ్యంలో బుజ్జిని పిచ్చిగా ప్రేమిస్తుంది ‘జో’ (శ్రద్ధాదాస్). ఈ ఘటన కథలో మరింత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఈ పరిస్తితుల్లో బుజ్జి తన భార్యను తిరిగిపొందుతాడా.. అనేది తెరపై చూడాలి.
ప్లస్ పాయింట్లు: ఈ చిత్రంలో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఉన్నాయి. పరిణితి చెందిన ఒక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బావుంది. అతను లోని రాజఠీవి ఈ చిత్రంలో కనిపిస్తుంది. అంతేకాదు తెరపై ఆయన నటన వీక్షకులను మెప్పించేదిగా ఉంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ను దర్శకుడు కృష్ణ వంశీ పూర్తి స్తాయిలో ఉపయోగించుకున్నాడు.
అటు హీరో గోపీచంద్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా తీర్చదిద్దారీచిత్రంలో. బీచ్ పాటలో అతను చాలా డాషింగ్ గా కనిపిస్తారు. తాప్సీ, శ్రద్ధాదాస్ లను చాలా ఆకర్షణీయంగా చూపించారు. ప్రత్యేకంగా సాంగ్స్ లో వీరి సౌదర్యం వర్ణనాతీతంగా ఉంది. ఈ ముద్దుగుమ్మల అందాల ఆరబోత మత్తెక్కించే రీతిలో సాగింది. హీరొయిన్ లను అత్యంత ఆకర్షణీయంగా చూపించటంలో కృష్ణవంశీ ప్రతిభ ‘మొగుడు’ మూవీ తో మరోసారి నిరూపితమైంది.
రోజా – నరేష్ లు వారి వారి పాత్రలను చక్కగా పోషించారు. అతిధి పాత్రలో ఆహుతి ప్రసాద్ లో నటన చాలా బావుండటమే కాదు ఎంతో కామెడి ని పండించింది. సినిమా మొదటి సగం కొన్ని ఆహ్లాదకరమైన ఫ్యామిలీ కామెడీ సన్నివేశాలు, గోపీచంద్ – తాప్సీ ల లవ్ ట్రాక్ చాలా బాగా పండింది. విరామానికి ముందు ట్విస్ట్ బావుంది.
మైనస్ పాయింట్లు: తాప్సీ చెప్పిన డబ్బింగ్ వినసొంపుగా లేదు. ఆమెకు ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను ఉపయోగించుకొంటే బావుండేది. ఆమె అభినయం మరింత మెరుగుపడాల్సిన అవసరం కనిపించింది.
నిశ్చితార్థం సమయంలో వచ్చే ‘ఎట్టాంటి మొగుడు’ సాంగ్ చిత్రీకరణ కాస్త లోపభూయిష్టంగా ఉంది. రెండో సగం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు గత కృష్ణవంశీ చిత్రాలను జ్ఞప్తికి తెస్తాయి. కుటుంభ కలహాల సన్నివేశం మరీ ఎబ్బెట్టుగా ఉంది.
సెకండ్ హాఫ్ లో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రీకరణలో మరింత శ్రద్ధ తీసుకుంటే బావుండేదనిపిస్తుంది.
హర్షవర్ధన్, మహర్షి మరియు వేణుమాధవ్ పాత్రలు వృధాగా అనిపిస్తాయి. ప్రతిభను ప్రదర్శించే వీలు వారికి లేకుండా పోయింది. తాప్సీ సోదరుడు – గోపీచంద్ వైరం అర్ధంతరంగా తేలిపోయింది
సాంకేతిక విభాగాలు : సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. కృష్ణవంశీ స్టైల్ కు తగ్గట్టుగా నృత్య రీతులు ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంత అసాధారణంగా సాగుతుంది. పాటల విజయవంతం కావడానికి మంచి సంగీతం ఎంతగానో తోడ్పడింది. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ ఓకే. ఫైట్స్ స్టైలిష్ గా ఉన్నాయి.
తీర్పు : ‘మొగుడు’ చిత్రాన్ని ఆశించిన స్తాయిలో సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దలేక పోయారనే చెప్పవచ్చు. మూవీ చాల ఆశాజనకంగా ప్రారంభమై ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్ గా సాగుతుంది. అయితే టూమచ్ మెలోడ్రామా, మోతాదు మించి ఎమోషనల్ సన్నివేశాలు తారసపడతాయి. కాగా, ఈ చిత్ర విజయానికి అనుకూల అంశాలు కూడా వున్నాయి. రాజేంద్ర ప్రసాద్ అద్భుత ప్రదర్శన, గోపీచంద్ డాషింగ్ లుక్ కు తోడు, తాప్సీ మరియు శ్రద్దాదాస్ అందాలు ఈ సినిమాకు అనుకూల అంశాలు. కానీ సెకండ్ హాఫ్ కొంత నిరాశ పరుస్తుంది.
– నారాయణ ఎ.వి