సమీక్ష : ఫంకీ – రొటీన్ గా సాగే సిల్లీ ఫన్ డ్రామా !

Vishwak Sen Funky

విడుదల తేదీ : ఫిబ్రవరి 13, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌, సీనియర్ నరేశ్ తదితరులు.
దర్శకుడు : అనుదీప్‌ కేవీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం
కూర్పు : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`.ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.

కథ :

కోమల్ (విశ్వక్‌ సేన్‌) ఒక అప్ కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్. నాలుగు కోట్లు అని చెప్పి,  తన మొదటి సినిమా ఫంకీ చిత్రానికి నలభై కోట్లు చేస్తాడు. ఆ దెబ్బతో నిర్మాత స్ట్రోక్ వచ్చి పడిపోతాడు. దాంతో ఆ నిర్మాత కూతురు చిత్ర (కయాదు లోహర్‌) రంగంలోకి దిగుతుంది. కోమల్ చేత కోటి రూపాయలతోనే బ్యాలెన్స్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తా అని మళ్లీ కోమల్ తో సినిమా స్టార్ట్ చేస్తుంది. మరి ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కోమల్ ఏం చేశాడు ?, బడ్జెట్ లో సినిమా పూర్తి చేశాడా ?, లేదా ?, ఇంతకీ.. కోమల్ కి – చిత్రకి మధ్య జరిగిన డ్రామా ఏమిటి ?, ఫైనల్ గా  ఫంకీ సినిమా ఏం అవుతుంది ?, కోమల్ – చిత్ర ఒక్కటి అయ్యారా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా నేపథ్యంలో సాగిన ఈ ఫంకీ సినిమాలో కొన్ని కామెడీ పంచ్ లు పేలాయి. అలాగే విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయింది. ముఖ్యంగా కయాదు లోహర్‌ స్క్రీన్ ప్రెజెన్సీ చాలా చోట్ల ఆడియన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. ఇక హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌ తన శైలి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. విశ్వక్‌ సేన్‌ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ తో సాగే ప్రేమ కథలో కూడా విశ్వక్‌ సేన్‌ నటన బాగుంది.

ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన సంపత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. తల్లిగా నటించిన ఈశ్వరరావు తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అనుదీప్‌ కేవీ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

హీరో కోమల్ పాత్రను, ఆ పాత్ర తాలూకు డైలాగ్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అనుదీప్, అంతే స్థాయిలో మిగిలిన పాత్రలను మరియు సీన్స్ ను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే, కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. మొత్తానికి స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

దీనికితోడు ఈ ఫంకీ సినిమా కథ కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది. సినిమా చూస్తున్నంతసేపు సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. కానీ, ఒక సీన్ కి మరొక సీన్ కి మధ్య టెంపో పెంచలేకపోయారు. కోమల్ పాత్రకు – మిగిలిన పాత్రలకు మధ్య ఇంకా బలమైన సంఘర్షణ పెడితే బాగుండేది. మొత్తానికి ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనుదీప్‌ కేవీ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా సురేష్ సారంగం చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ నవీన్ నూలి తగ్గించాల్సింది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ఫంకీ’ అంటూ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో..  కామెడీ డైలాగ్స్ అండ్ కొన్ని సీన్స్ పర్వాలేదు. నటీనటుల నటన కూడా బాగానే ఉంది. ఐతే, బోరింగ్ ప్లే, రెగ్యులర్ సీన్స్ అండ్ సింపుల్ స్టోరీ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
Message Anil Kumar Aaleti

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version