
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సూర్య చెస్ ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ప్రస్తుతం సూర్య హీరోగా మాస్ పల్స్ తెలిసిన లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అంజాన్’. ఈ సినిమాకి కూడా ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకి సంబందించిన రైట్స్ కి మంచి డిమాండ్ నెలకొంది.
ఈ సినిమాకి సంబందించిన తెలుగు డబ్బింగ్ రైట్స్ ని లార్స్కో ఎంటర్టైన్మెంట్ అధినేత లగడపాటి శ్రీధర్ ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నాడు. కేరళ, కర్ణాటకకి సంబందించిన రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది.

