
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్న మాట విధితమే. చిన్న విరామం తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. బాహుబలి సెట్ లలో మళ్లీ తిరిగి నటిస్తున్నామని.. రాజమౌళి సార్ తో పనిచేయడం చాలా బాగుంటుందని ట్విట్టర్ లో తెలిపాడు
భుజంగాయం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న ప్రభాస్ కూడా కోలుకుని షూటింగ్ లో పాల్గొనున్నాడుఈ సినిమాలో టైటిల్ రోల్ ప్రభాస్ పోషించగా రానా విలన్ పాత్రని పోషిస్తున్నాడు. అనుష్క మరియు తమన్నా హీరోయిన్స్
కీరవాణి సంగీతదర్శకుడు. సెంథిల్ కెమెరామ్యాన్. రమ్యకృష్ణ, నాజర్, సత్య రాజ్ మరియు అడివి శేష్ ముఖ్యపాత్రధారులు

