ఈ సంవత్సరం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అక్కినేని నాగార్జున చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ షో ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. అలాగే ఈ షో అందరికీ గుర్తుండేలా ఎంఈకె గా షార్ట్ కట్ లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
నాగార్జున మొదటిసారి బుల్లి తెరపై కనిపించనున్న ఈ షో హిందీలో అమితాబ్ బచ్చన్ యాంకర్ గా హిట్ అయిన ‘కౌన్ బనేగా కరోర్పతి’ షో కి తెలుగు వెర్షన్. రేపటి నుంచి ఈ షో టీవీలో ప్రసారం కానుంది. ఈ షో కి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారని అనదరూ ఆశిస్తున్నారు.
అలాగే నాగార్జున ఈ షోతో చాలా మంది జీవితాలు మారిపోతాయని అంటున్నారు. మరి నాగార్జున గారు ఎలా జీవితాల్ని మారుస్తారో చూడాలి.. ‘మనం’ సాధించిన భారీ విజయంతో ఎంతో ఉత్సాహంగా నాగార్జున ఈ షోలో పాల్గొంటున్నారు..


