
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి కళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించనున్న సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా వార్తల్లో తిరుగుతున్నప్పటికీ ఎప్పుడు మొదలవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే దానికి రేపటితో తెరపడనుంది.
వెంకీ – పవన్ లకి చెందిన ‘గోపాల గోపాల(వర్కింగ్ టైటిల్)’ సినిమా రేపు ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ ముహూర్త కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, వెంకటేష్ హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇది బాలీవుడ్ లో హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్.
డాలీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించనున్నారు.
వెంకటేష్ సరసన శ్రియ శరణ్ నటించనుంది.

