విడుదలకు సిద్దమైన విష్ణు – వర్మ సినిమా

విడుదలకు సిద్దమైన విష్ణు – వర్మ సినిమా

Published on Jun 8, 2014 9:26 PM IST

RGV-and-Vishnu-Manchu
మంచు విష్ణు హీరోగా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసి కంఫర్టబుల్ గా సినిమాలు చేస్తున్నారు. వారి కాంబినేషన్ లో వచ్చిన ‘రౌడీ’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది.

వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు