రామ్ చరణ్ మూవీ కోసం జయసుధకి భారీ ఆఫర్

రామ్ చరణ్ మూవీ కోసం జయసుధకి భారీ ఆఫర్

Published on Jun 9, 2014 1:03 PM IST

jayasudha
కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో జయసుధ ఓ కీలక పాత్ర పోషించనుందని తెలియజేశాం. ఇప్పటికే ముందుగా అనుకున్న నటీనటుల్లో చాలా మంది చేంజ్ అయ్యారు. తాజాగా రాజ్ కిరణ్ ని అనుకున్న పాత్రలో ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసారు.

ఈ చిత్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ ప్రొడక్షన్ హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే జయసుధ పాత్ర కోసం తనకి భారీ పారితోషికాన్ని ఇచ్చారు. మాకున్న సమాచారం ప్రకారం జయసుధకి ఈ సినిమా కోసం 35 లక్షలు ఇచ్చారు. ఆమె పాత్రకి ఉన్న నిడివి దృష్ట్యా చూసుకుంటే ఆమె తీసుకునే పారితోషికం కంటే చాలా ఎక్కువ ఇచ్చినట్లు సమాచారం.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యువస్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు