సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న అంజలి-హర్షవర్ధన్ రాణే

సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న అంజలి-హర్షవర్ధన్ రాణే

Published on Jun 10, 2014 12:27 PM IST

Anjali_harshvardhan_rane
‘జర్నీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విఅప్రీతమ్గా ఆకట్టుకున్న తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘గీతాంజలి’. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలోని ఓ పాటని ప్రస్తుతం చిక్ మంగళూరులో షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అంజలి సరసన అతిధి పాత్రలో హర్షవర్ధన్ రాణే కనిపించనున్నాడు. ప్రస్తుతం హర్షవర్ధన్ కూడా సాంగ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తన పాత్రపై హర్షవర్దన్ స్పందిస్తూ ‘ఈ పాత్ర చాలా చిన్నదే అయినా కామెడీగా ఉంటుంది. అలాగే నాకు బాగా ఇష్టమైన అంజలి సరసన నటించడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

రాజకిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ హర్రర్ కామెడీ సినిమాకి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ కోన వెంకట్ అందిస్తున్నాడు. ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు