
‘కొచ్చాడియాన్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన రజినీ కుమార్తె సౌందర్య రజినీకాంత్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరొక జర్నలిస్ట్ అయితే శింబుని ఏమి అడుగుతారు అని అడిగితే శింబుని ఇక నుంచి పాడద్దని అడుగుతానని చెప్పింది.
ఈ కామెంట్ ని శింబు ఫ్యాన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేదు. దానివల్ల శింబు అభిమానులు సోషల్ మీడియాలో సౌందర్య రజినీకాంత్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై శింబు కామెంట్ చేసేంత వరకూ వెళ్ళింది. ‘ప్రతి ఒక్కరికి ఎవరిపైనైనా కామెంట్ చేసే హక్కు ఉంటుంది. విమర్శలను ఇక ఆపేయాలని మా అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మీరు నాపై చూపించే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. మీరు అదే ప్రేమని వారిపై కూడా చూపించాలని కోరుకుంటున్నానని’ శింబు సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేసాడు.
ఈ విషయంపై సౌందర్య స్పందిస్తూ ‘శింబు నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్. నేను అప్పుడు అక్కడ చెప్పింది కామెడీగా మాత్రమే అంతే కానీ వేరే ఉద్దేశంతో కానీ అన్నది కాదని’ సౌందర్య ట్వీట్ చేసింది.

