నీలకంఠ ‘మాయ’ ఆడియో రిలీజ్ డేట్

నీలకంఠ ‘మాయ’ ఆడియో రిలీజ్ డేట్

Published on Jun 11, 2014 6:06 PM IST

maya
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో త్వరలో మన ముందుకు రానున్న సినిమా ‘మాయ’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆడియోని జూన్ 14న లాంచ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. దీని ప్రకారం ఒక మనిషి జరగబోయే దాన్ని ముందే తెలుసుకోగలిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న పాయింట్ చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది.

హర్ష వర్ధన్ రాణే హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో అవంతిక, సుష్మ, నందిని రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మధుర శ్రీధర్ సమరపనలో ఎంవికె రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నీలకంఠ ఈ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వస్తానని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు