ఇమేజ్ ని మార్చుకోవడానికి సిద్దం అయిన గోపీచంద్

ఇమేజ్ ని మార్చుకోవడానికి సిద్దం అయిన గోపీచంద్

Published on Jun 14, 2014 12:10 AM IST

Gopichand
మాచో హీరో గోపీచంద్ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. ‘మొగుడు’ లాంటి కుటుంబ కధా చిత్రంలో నటించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధించలేదు. ఒకేరకమైన పాత్రలు పోషించడం గోపీచంద్ చిత్రాలని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావితం చేసింది.

అందువల్ల ఈ మాచో హీరో తన ఇమేజ్ ని మార్చుకోవడానికి సిద్దం అవుతున్నాడు. తన రాబోయే చిత్రాల్లో ఎంతో స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గోపీచంద్ రెండు చిత్రాల ఫస్ట్ లుక్ ఎంతో అందంగా వున్నాయి.

గోపీచంద్ తన మార్కెట్ ను విస్తరించుకోవడానికి ప్రస్తుతం యూత్ మరియు మహిళ ల పై ద్రుష్టి సారిస్తున్నాడు. మంచి శరీర సౌష్టవం తో పొడగరి అయిన గోపీచంద్ కి మహిళలని యువతని ఆకర్షించడానికి ప్రస్తుతం కావాల్సింది కొంచం స్టైల్. తన చిత్రాల ఫస్ట్ లుక్కి వచ్చిన స్పందన చూస్తుంటే గోపీచంద్ ఈ విషయం లో విజయం సాధిస్తున్నట్టె.

తాజా వార్తలు