
నటుడు సందీప్ కిషన్ మీడియా లో చక్కర్లు కొడుతున్న తప్పుడు వార్తల పై అసహనం వ్యక్తం చేసారు. ‘జై బోలో తెలంగాణా’ లో నటించిన నటుడు సందీప్ తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.
ఈ సందీప్ ని సందీప్ కిషన్ అనుకున్న కొంతమంది మీడియా లో తప్పుడు వార్తలని వ్యాపించారు. ఈ విషయానికి కోపగించిన సందీప్ కిషన్ మీడియా ఒక వార్త వెల్లడించేముందు ఒకటికి రెండు సార్లు నిజానిజాలు పరిశీలించాలని కోరారు.
“దయచేసి కొంచం భాద్యతగా వ్యవహరించండి. ఒక డ్రగ్ రాకెట్ ని పట్టుకున్నపుడు ‘ప్రస్థానం’ సినిమాలోని విసువల్స్ చూపించారు. కనీసం కింద అయిన ఆ విషయాన్నీ తెలపండి. నా కుటుంబానికి పొద్దునే ఫోన్లు రావడం నాకు ఇష్టం లేదు. నేను ఒక భాద్యతగల పౌరుడిని ఎప్పటికి అలానే వుంటాను. దయచేసి ఒక వార్త జాగ్రత్తగా తెలపండి.” అని సందీప్ కిషన్ అన్నారు.

