
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ మోడళ్ళు పెట్టాడు అంటే తను చేసే మొదటి పని బ్యాంకాక్ వెళ్ళిపోవడం. తన ప్రతి స్క్రిప్ట్ ని బ్యాంకాక్ వెళ్ళి అక్కడ బీచ్ లో కూర్చొని రాయడం పూరికి అలవాటు. అలానే ఇప్పుడు కూడా బ్యాంకాక్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేయనున్న తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ కథని అందిస్తున్న ఈ సినిమాని స్క్రిప్ట్ ని పెర్ఫెక్ట్ట్ గా ఫినిష్ చేసే పనిలో పూరి ఉన్నాడు.
‘బాద్షా’ తర్వాత బండ్ల గణేష్ నిర్మాతగా ఎన్.టి.ఆర్ చేస్తున్న రెండవ సినిమా ఇది. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి ‘రుబాబు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. జూన్ చివర్లో మొదలయ్యి జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

