అల్లరి నరేష్ కి సిస్టర్ పాత్రలో కార్తీక.!

అల్లరి నరేష్ కి సిస్టర్ పాత్రలో కార్తీక.!

Published on Jun 16, 2014 10:20 PM IST

Allari-Naresh-karthika
‘జోష్’, ‘దమ్ము’, ‘రంగం’ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన రాధ కుమార్తె కార్తీక నాయర్ గుర్తుందా.. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కానీ ఈ భామ ఇప్పుడు ఒక డేర్ స్టెప్ తీసుకొని హీరోకి సిస్టర్ పాత్రలో కనిపించనుంది.

చిన్ని కృష్ణ దర్శకత్వంలో, అమ్మిరాజు నిర్మాతగా అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో అల్లరి నరేష్ కి సిస్టర్ పాత్రలో కార్తీక కనిపించనుంది. ఇందులో విలన్ ని లవ్ చేసే అమ్మాయిగా, అలాగే అడ్వెంచర్ స్టంట్స్ చేసే పవర్ ప్యాక్ రోల్ లో కార్తీక కనిపించనుంది. గతంలో చాలా సార్లు కార్తీకని నరేష్ సరసన హీరోయిన్ గా అనుకున్నారు కానీ అవేవి సెట్ కాలేదు. చివరికి ఇలా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో మూవీ కుదిరింది. ఈ మూవీలో నరేష్ సరసన సుడిగాడు ఫేం మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు