తమిళ్ మార్కెట్ పై కన్నేసిన నందిత

తమిళ్ మార్కెట్ పై కన్నేసిన నందిత

Published on Jun 17, 2014 2:42 AM IST

Nanditha
కొన్ని చిత్రాలలో అధ్బుతమైన నటన తో తనకంటు ఒక పేరు తెచ్చుకున్న నటి నందిత. ‘ప్రేమ కధ చిత్రం’ లో తన టాలెంట్ ని ప్రదర్శించిన నందితకు తెలుగు లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ నటి ఇప్పుడు తెలుగులో పాటు తమిళ్ లో కూడా తనకంటు ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కృషి చేస్తుంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం నందిత తమిళ్ రచయితలు నిర్మాతలు చెప్పిన కధలు వింటుంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే నందితని తమిళ్ చిత్రంలో చూడొచ్చు.
నందిత ఇప్పటికే ‘లండన్ బ్రిడ్జ్’ అనే ఒక మలయాళం చిత్రంలో నటించింది. నందిత కి అంతా అనుకూలంగా జరిగితే దక్షిణాదిలో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందేమో వేచిచూడాలి.

తాజా వార్తలు