2015 ఏప్రిల్ 17న రానున్న ‘బాహుబలి’.?

2015 ఏప్రిల్ 17న రానున్న ‘బాహుబలి’.?

Published on Jun 17, 2014 2:14 PM IST

Bahubali
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం ఒక్క తెలుగు ఇండస్ట్రీనే కాకుండా యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పలు మేకింగ్ ట్రైలర్స్ లో ఈ సినిమాని 2015లో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు కానీ కచ్చితమైన తీదీని మాత్రం అనౌన్స్ చేయలేదు.

తాజాగా మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి ఆస్కారం ఉండడం వల్ల ఈ సినిమా ఎక్కువ టైం తీసుకుంటోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు