
గతంలో దాసరి నారాయణ రావు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు శాఖనే కాక పలు వివిధ డిపార్ట్ మెంట్ లను సైతం నిర్వర్తించేవారు. వాటిలో స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం వంటివి వుండేవి. దాసరి వారు దాదాపు 5 నుండి 6 సినిమా విభాగాలు హ్యాండిల్ చేసారు
ప్రస్తుత తరంలో సామాజిక స్పృహతో సినిమాలు తో సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తి తన తదుపరి సినిమాకు ఇదే పంధాని ఫాలో అవుతున్నారని సమాచారం. ఆయన నుంచి రాబోతున్న ‘రాజ్యాధికారం’సినిమాలో ఆయన ఏకంగా దర్శకత్వం, సంగీతం, ఫోటోగ్రఫీ, కధ, సంభాషణలు మరియు నిర్మాణం అంటి ఆరు విభాగాలను హ్యాండిల్ చేసారట
ప్రస్తుత రాజకీయాలు, అవినీతిని బేస్ చేసుకుని నారాయణమూర్తి సినిమాలు వుంటాయి. ఈ సినిమా ఈనెలలో సెన్సార్ ముగించుకుని ఆ తరువాత విడుదల తేదిని ప్రకటించనున్నారు

