
ప్రస్తుతం ఘనంగా రోజుకో ట్విస్ట్ తో జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఈ ఏడాది కే తలమానికంగా నిలిచే ఆటగా వెలసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఈ ఆటను వీక్షిస్తున్నారు
దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. మన యువ తారలు క్రమం తప్పకుండా అన్ని మ్యాచులనీ ఫాలో అవుతూ వాటి గురించి ట్వీట్ లు పెడుతున్నారు
నాని, రానా దగ్గుబాటి, అఖిల్, సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ వంటి తారలు తరచూ ఫుట్ బాల్ మ్యాచులగురించి ట్విట్టర్ లో మాట్లాడుకుంటారు. వీరేకాక మరికొంతమంది యువ దర్శకులు, నాయికామణులకు సైతం ఈ ఫుట్ బాల్ ఫీవర్ అంటుకుంది

