
సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ‘రా రా కృష్ణయ్య’ సినిమా జూలై 4న విడుదల కడానికి సిద్దమవుతుంది. ఈ సినిమా ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పుర్తిచేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.
పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్వికే సినిమా బ్యానర్ సంస్థ నిర్మిస్తుంది. ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా హిట్ తరువాత మంచి ఉపుమీధ ఉన్న సందీప్ కిషన్ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.
వైజాగ్ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ మరియు రెజినాల మధ్య లిప్ లాక్ కూడా ఉంది.

