ప్రతి శుక్రవారం భాష అనేది సంబంధం లేకుండా ప్రతి భాషలోనూ ఏదో ఒక సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేస్తూ సినీ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. అది కూడా ఒక్క సినిమా కాదు ఏకంగా 5 సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఈ ఐదు సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ‘ఈగ’, ‘లెజెండ్’ సినిమాలు తీసిన సాయి కొర్రపాటి నిర్మాతగా, శ్రీని అవసరాల డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. నాగ శౌర్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక రెండవ సినిమా ప్రదీప్ దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్, సత్య దేవ్, ఇషా తల్వార్, మధుమతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇవి కాకుండా విశాల్ హీరోగా నటించిన ‘నాన్ సిగప్పు మనిదన్’ సినిమాని ‘ఇంద్రుడు’ పేరుతో నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నూతన నటీనటులను పరిచయం చేస్తూ జిఎస్ రావు డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన సినిమా ‘నేను నా ఫ్రెండ్స్’. అలాగే నూతన నటీనటులతో శ్రీ హరి ప్రధాన పాత్రలో చేసిన ‘శివ్ కేశవ్’ సినిమా కూడా నేడే విడుదల కానుంది.
మరి ఈ రోజు విడుదలైన ఈ ఐదు సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో మరి కొద్ది సేపట్లో చూద్దాం…


