మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి కామెడీ చేస్తున్నాడు. శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని ట్రాన్స్పోర్ట్ విభాగం, రహదారులపై జరుగుతోంది. అక్కడ గోపిచంద్, అతని డ్రైవర్ అయిన బ్రహ్మానందం మధ్య కొన్ని కామెడీ సీన్స్ షూట్ చేస్తున్నారు.
గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వై. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ – శ్రీ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
గోపీచంద్ ఇది కాకుండా బి. గోపాల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా చివరి దశలో ఉంది. అది కాకుండా రాధాకృష్ణ డైరెక్టర్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేసే సినిమా కూడా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది.


