
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తను నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలోని టాకీ పార్ట్ ని షూట్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం జూలై 10 కల్లా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న సాంగ్స్ ని అబ్రాడ్ లో షూట్ చేస్తారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
జూలై మూడవ వారంలో లేదా నాల్గవ వారంలో ఆడియో ని రిలీజ్ చేసి ఆగష్టు 14న సినిమాని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కూడా పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

