అక్టోబర్ చివర్లో రానున్న పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’

అక్టోబర్ చివర్లో రానున్న పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’

Published on Jul 2, 2014 9:38 AM IST

pawan-kalyan-venkatesh
టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గాడ్ గా కనిపిస్తుంటే, వెంకటేష్ కామన్ మాన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఈ చిత్రం ప్రారంభించినప్పుడు ఈ సినిమాని అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకున్న టైం కంటే షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఆ టైంకి కూడా ఏమన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యమైతే నవంబర్ మొదటి వారంలో కచ్చితంగా రిలీజ్ చేసేలా చిత్ర టీం ప్లాన్ చేసింది. వెంకటేష్ సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని(డాలీ) డైరెక్టర్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు