సెప్టెంబర్ నుండి నాగ్-ఎన్టీఆర్ ల సినిమా.?

సెప్టెంబర్ నుండి నాగ్-ఎన్టీఆర్ ల సినిమా.?

Published on Jul 5, 2014 3:40 PM IST

ntr_nag

కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వంశి పైడిపల్లి దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని సమాచారం. పివిపి సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున, ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు వంశి పైడిపల్లి కథను హీరోలిద్దరికి వినిపించడం, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం. వీరి పక్కన నటించే హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్య అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు