‘భక్త కన్నప్ప’ స్క్రిప్ట్ రెడీ – తనికెళ్ళ భరణి

‘భక్త కన్నప్ప’ స్క్రిప్ట్ రెడీ – తనికెళ్ళ భరణి

Published on Jul 14, 2014 11:28 AM IST

Bhakta-Kanappa
కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన నటుడు సునీల్. హీరోగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళలో కామెడీ ప్రధానంగా ఉండే చిత్రాలలో నటించారు. ప్రస్తుతం యాక్షన్ కామెడీ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. యాక్షన్ చిత్రాల కోసం సిక్స్ ప్యాక్ చేశారు. మధ్యలో ప్రయోగాత్మక చిత్రాలవైపు కూడా ఓ కన్నేశారు. నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ‘భక్త కన్నప్ప’ అనే భక్తిరస చిత్రంలో నటించడానికి తన అంగీకారం తెలిపారు. చాలా రోజులైనా ఇంకా ప్రాజెక్ట్ మొదలుకాలేదు. తనికెళ్ళ భరణి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తిచేసేశారు. సునీల్ రెడీ అంటే చిత్రీకరణ మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.

తెలుగులో 30 ఏళ్ళ క్రితం రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్పగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ ప్రేక్షకుల మన్ననలు పొందింది. తాజా చిత్రం కథ ఒకటే అయినా స్క్రీన్-ప్లే, సన్నివేశాల చిత్రీకరణ కొత్తగా ఉంటుందని భరణి తెలిపారు. 11వ శతాబ్ద కాలం నాటి కథగా, కన్నప్ప పాత్రలో సునీల్‌ను ఓ ఆటవికునిగా చూపించబోతున్నాని అన్నారు. స్వతహగా శివభక్తుడైన భరణి ‘భక్త కన్నప్ప’ చేస్తున్నారు అనగానే పరిశ్రమలో అంచనాలు ఏర్పడ్డాయి. కన్నప్ప పాత్రలో కనిపించడానికి ‘భక్త కన్నప్ప'(సునీల్ ) ఎప్పుడు రెడీ అంటారో..? గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారో..?

తాజా వార్తలు