నీలకంఠ ‘మాయ’ రిలీజ్ డేట్..

నీలకంఠ ‘మాయ’ రిలీజ్ డేట్..

Published on Jul 14, 2014 5:39 PM IST

mayya
జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత, దర్శకుడు నీలకంఠ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మాయ’. భవిష్యత్ ముందే తెలిస్తే ఎలా ఉంటుంది అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలలో ఒకరైన మధుర శ్రీధర్ తెలిపారు. సెన్సార్ వారు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటివల విడుదలైన మాయ పాటలకు శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. షిర్డిసాయి కంబైన్స్‌ పతాకంపై ఎమ్‌.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు