సల్మాన్ కి మీడియాకి మధ్య వివాదం

సల్మాన్ కి మీడియాకి మధ్య వివాదం

Published on Jul 15, 2014 2:52 AM IST

Salman-Khan
సాధారణంగా పత్రికావర్గాలకీ సినిమా నటులకీ మధ్య వైరం ఏర్పడదు కానీ ఒక్కసారి అంటూ గొడవ రాజుకుంటే అది అంత తేలికగా కొలిక్కి రాదు. ఇప్పుడు అలాంటి మరో పెద్ద గొడవ సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ లకీ మధ్య నెలకొంది

మీడియాకి సల్మాన్ ఖాన్ కి సఖ్యమైన సంబంధాలు ఎప్పుడూ లేవు. ‘కిక్’ ప్రచారవేడుకలో సల్మాన్ఖాన్ కి ఫోటోగ్రాఫర్లకి మధ్య గొడవ మొదలైంది. దీని కారణాన సల్మాన్ తదుపరి వేడుకలకు ఫోటోలను తీయడానికి విముఖత చూపించారు

ఈ విషయం తెలిసిన సల్మాన్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ విధంగా పేర్కున్నాడు “ఫోటోగ్రాఫర్ లు వారి పనిని సరిగ్గా నిర్వహించలేదు. దానికి తోడు వాళ్ళు నా పై ఈ నిర్ణయం తీసుకుని వుంటే ఎంతకాలం ఈ నిర్ణయంపై నిలబడతారో వేచి చూద్దాం” అని చెప్పుకొచ్చాడు

బాలీవుడ్ పెద్దమనుషులు జోక్యం చేసుకుని ఈ గొడవను పరిష్కరించే పనిలో వున్నారని సమాచారం

తాజా వార్తలు