
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ మౌత్ టాక్ తో విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ దృశ్యం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా శాటిలైట్ రైట్స్ విషయంలోనూ భారీ రేటు పలికింది. మాకు అందిన సమాచారం ప్రకారం 5.50 కోట్లకి దృశ్యం శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీవారు సొంతం చేసుకున్నారు.
తన ఫ్యామిలీ కోసం ఏమన్నా చేయడానికి సిద్దపడే రాంబాబు(వెంకటేష్) కొన్ని కారణాల వల్ల తన ఫ్యామిలీ కోసం పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. మీనా, నదియా, కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి శ్రీ ప్రియ డైరెక్టర్. సురేష్ బాబు – రాజ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి రీమేక్.

