
బ్రహ్మానందం.. ఆ పేరు విన్నా, స్క్రీన్ మీద ఆయన బొమ్మ కనపడినా తెలుగు ప్రేక్షకుల పెదవులపై ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చేస్తుంది. దర్శకులు తమ సినిమాలలో బ్రహ్మానందం క్యారెక్టర్ పై ప్రత్యెక శ్రద్ధ వహిస్తున్నారు. రచయిత కోన వెంకట్ తన ప్రతి సినిమాలో బ్రహ్మానందం కోసం ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ క్రియేట్ చేస్తారు. రావు గారు(డీ), మెక్ డోనాల్డ్ మూర్తి(రెడీ), భట్టూ(అదుర్స్), పద్మనాభ సింహ(బాద్షా), జయసూర్య(కింగ్) వంటి పాత్రలు కోన వెంకట్ కలం నుండి బయట పడినవే.
అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ నిర్మిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’. ఈ చిత్రంలో బ్రహ్మానందంను సైతాన్ రాజుగా చూపించాబోతున్నారు. అసలే హారర్ సినిమా. ఇందులో బ్రాహ్మి సైతాన్ రాజుగా ప్రేక్షకులకు ఎంత వినోదం అందిస్తాడో..!

