‘గోవిందుడు అందరివాడేలే’ గొప్ప సినిమా – వెంకటేష్

‘గోవిందుడు అందరివాడేలే’ గొప్ప సినిమా – వెంకటేష్

Published on Jul 15, 2014 6:41 PM IST

Venkatesh
విక్టరీ వెంకటేష్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం నుండి ఎందుకు పక్కకు తప్పుకున్నారు. ఈ విషయంలో చాలా పుకార్లు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయిగా నటించడానికి ఇష్టం లేదు..! కథ నచ్చలేదు..! అంటూ ఎవరికీ తోచిన వార్తలను ప్రచారం చేశారు. ఇవేవి నిజం కాదని వెంకి వెల్లడించారు. ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చరణ్ బాబాయి పాత్ర నా ఇమేజ్ కు సరిపోదని, చాలా చిన్నది అయిపోతుందని దర్శకనిర్మాతలు భావించారు. అందుకే ఆ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. ఇది అందరూ కలసి చర్చించి తీసుకున్న నిర్ణయం. స్క్రిప్ట్ బాగా కుదిరింది. అద్భుతమైన కథ. ‘గోవిందుడు అందరివాడేలే’ తప్పకుండా గొప్ప సినిమా అవుతుంది. అని వెంకటేష్ చెప్పారు.

యువన్ శంకర్ రాజా అందించిన గోవిందుడి పాటలు ఆగస్ట్ మూడవ వారంలో విడుదల కానున్నాయని సమాచారం. పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్ జూలై 28న కృష్ణవంశి పుట్టినరోజున విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు