
తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు అందాల భామలు. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత తమిళ చిత్రాలు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపుతుంది. సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన తమిళంలో సినిమాలు చేస్తుంది. సమంత చూపిన దారిలో శృతి హాసన్ వెళ్తుంది.
శృతి కూడా ఎక్కువగా తమిళ చిత్రాలపై ఆసక్తి చూపుతుంది. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన ‘పూజై’లో నటిస్తుంది. తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మరోచిత్రంలో నటించనున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వెల్లడించింది. శృతి తెలుగులో నటించిన చివరి చిత్రాలు ఎవడు, రేసుగుర్రం భారి విజయాలను నమోదు చేశాయి. ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయినా అమ్మడు మరో తెలుగు సినిమా అంగీకరించలేదు.

