మంచు మనోజ్ సరసన ‘హార్ట్ ఎటాక్’ భామ..!

మంచు మనోజ్ సరసన ‘హార్ట్ ఎటాక్’ భామ..!

Published on Jul 27, 2014 1:04 PM IST

manoj_adahsharma

యంగ్ & ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ ఆదా శర్మ. ప్రస్తుతం మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాగర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రెండు డిఫరెంట్ గెటప్ లలో ఆదా శర్మ కనిపిస్తుందట. ఒకటి గ్లామర్, మరొకటి ట్రెడిషనల్ రోల్. చాలా మంది హీరోయిన్లను పరిశీలించిన తర్వాత ఆదా శర్మను సెలెక్ట్ చేశారు. ఆమె రెండు పాత్రలకు న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావించారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

తాజా వార్తలు