150వ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి మెగాఫోన్ పట్టుకోనున్న సినిమా ‘ఎర్రబస్సు’.
ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘మంజపై’ సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మంచు విష్ణు హీరోగా, కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని ఇటీవలే లాంచనంగా ప్రారంభించారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. తాత – మనవడు మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాతయ్య పాత్రలో దాసరి నారాయణరావు కనిపించనున్నాడు. నుంచి విష్ణు చేస్తాను అని చెబుతున్న దాసరి ఎట్టకేలకు ఎర్రబస్సు రూపంలో విష్ణు తీసుకెళ్ళాడు. తమిళంలో విజయవంతమైన ఈ తాత – మనవడి సినిమా తెలుగులో ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి..


