ఈతరం హీరోయిన్లలో తమన్నా చాలా హాట్ లుకింగ్ గర్ల్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఇటివల సుహాసిని మణిరత్నం, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో కలసి పాల్గొన్నారు. ప్రజెంట్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ & తమన్నా.. వీళ్ళలో ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్..? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అందరూ చాలా హాట్, తమన్నా హాటెస్ట్’అని సమాధానం ఇచ్చారు.
అలనాటి హీరోయిన్లలో జయసుధ, జయప్రద అంటే ఇష్టమని తెలిపారు. వారు బాగా నటించేవారు అని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన అల్ టైం క్లాసికల్ సినిమా ‘అడవి రాముడు’ 20సార్లు చూసినట్టు చెప్పారు. ‘అడవి రాముడు’ సినిమా చూసిన తర్వాత జయసుధ, జయప్రదల అభిమానిగా మారానని అన్నారు.


