నైజాంలో కలెక్షన్స్ అదరగొడుతున్న ‘అల్లుడు శీను’

నైజాంలో కలెక్షన్స్ అదరగొడుతున్న ‘అల్లుడు శీను’

Published on Jul 29, 2014 2:30 PM IST

alludu-Sreenu

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లుడు శీను’. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హీరో కొత్త అయినా అతనికి వినాయక్ మార్క్ తోడవడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో వివి వినాయక్ మాట్లాడుతూ ‘అల్లుడు శీను కి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక్క నైజాంలో కేవలం 4 రోజుల్లో 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నా కెరీర్ లో నాలుగు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం. అలాగే మిగిలిన ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయని’ అన్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలిచింది.

తాజా వార్తలు